మహేష్ బాబుకు – మెహర్ రమేష్ కి ఉన్న బంధం ఇదే..!

తెలుగు ఇండస్ట్రీ లో డైరెక్టర్ మెహర్ రమేష్ అంటే భారీ బడ్జెట్ తో నిర్మించగలిగే దర్శకుడిగా పేరుంది. తన సినీ కెరియర్ లో హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా వున్నాయి. కథ పరంగా బాగున్న దాని చూపించే విధానం సరిగ్గా లేకపోవడం తో ఫెయిల్ అవుతూ ఉంటాడు మెహర్ రమేష్. ఇక ఈయనకు అతిపెద్ద ఫ్లాప్ సినిమాలో శక్తి, షాడో సినిమాలు భారీ డిజాస్టర్లుగా చవిచూశాయి.

షాడో తర్వాత కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని చిరంజీవితో వేదం సినిమా రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈయన ఎవరో కాదు పూరి జగన్నాథ్ శిష్యుడు మెహర్ రమేష్. ఇక మహేష్ బాబు తో తన సన్నిహితంగా ఉండడం వల్ల మహేష్ బాబు, మెహర్ రమేష్ అంత క్లోజ్ ఏంటి అని అనుకుంటున్నారు కొంతమంది. ఇక త్వరలో ఇద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తీయబోతున్నట్లు సమాచారం.

డైరెక్టర్ మోహర్ రమేష్, మహేష్ బాబు తో ఉన్న బంధాన్ని తెలియజేశారు. మహేష్ బాబు కు ఎటువంటి కథ చెప్పినా కూడా చీ అంటారని తెలియజేశారు. ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇదేనని తెలియజేశారు మెహర్ రమేష్. మహేష్ బాబు నేను కథ చెప్పడం అతని చీ కొట్టడం ఇలా చాలాసార్లు జరిగిందని రమేష్ పేర్కొన్నారు.

కానీ మెహర్ రమేష్ ఉన్నదున్నట్లుగా చెప్పడంలో తనకంటూ ఒక ఫిలాసఫీ ఉంచుతున్నట్లు తెలుస్తున్నది. ఇక అంతే కాకుండా ఇలా తనంతటతాను చెప్పడం వల్ల మహేష్ బాబు ఫ్యాన్స్ అతన్ని గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. అయితే భవిష్యత్తులో మహేష్ బాబు సినిమా వచ్చే అవకాశం ఉందేమో వేచి చూడాల్సిందే.