కోలీవుడ్ స్టార్ హీరో పై నిషేధం ఎత్తివేత..?

కోలీవుడ్ లో ఏప్పుడు వివాదాలకు దారి తీస్తూనే ఉంటాడు హీరో శింబు. హీరోయిన్లతో ఎఫైర్ దగ్గర నుండి.. దర్శక నిర్మాతలతో గొడవలు వరకు వెళుతూ ఉంటాడు ఈ స్టార్ హీరో. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శింబు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఆయనకి అసలు ఏ సినిమా కూడా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు.

సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ తో గొడవ పడడం చేత తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి రెడ్ కార్డు నిషేధానికి దారితీసింది. ఎట్టకేలకు ఈయన మీద అటువంటి నిషేధాన్ని తీసేసింది.శింబు. ఇక ఈ హీరో TFPC సభ్యులతో మాట్లాడి పరిష్కరించుకున్నాడని అందుచేతే వారు రెడ్ కార్డు నుంచి విముక్తి కల్పించారని కోలివుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది.ప్రస్తుతం హీరో శింబు చాలా సినిమాలలో నటిస్తున్నాడట.

వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్లో రెండు సినిమాలు, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒకటి, మరొక పొలిటికల్ థ్రిల్లర్, ఇలా మరికొన్ని సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.ఈయన మీద రెడ్ కార్డ్ నిషేధం ఎత్తివేయడంతో శింబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకమీదట శింబు సినిమాలను ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని శింబు అభిమానులు ఆశిస్తున్నారు.

ముఖ్యంగా ఈయన కెరియర్లో వివాదాలకు పెద్ద కారణం హీరోయిన్లతో ఎఫైర్ కొనసాగించడం.