జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కీ ఎదిగాడు. మొదట నిన్ను చూడాలని సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ తెరంగేట్రం చేశాడు. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు ఎందుకు ఎదిగి కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమాకు వచ్చిన పారితోషికాన్ని తన జీవితంలో మరిచిపోలేడట. మొదటిసారిగా తనకు నాలుగు లక్షల పారితోషికం వచ్చిందట. అయితే దానిని తన తల్లికి ఇచ్చేసినట్లు ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా తాజాగా పూర్తి అయ్యింది. ఈ త్రిబుల్ ఆర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్ 60 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.