హీరోయిన్ భానుప్రియ రియల్ లైఫ్ ఎలా ఉందో తెలుసా ?

హీరోయిన్ భానుప్రియ అంటే సినీ ఇండస్ట్రీకి బాగా పరిచయం ఉన్న హీరోయిన్. ఈమె మెగాస్టార్ చిరంజీవి యుక్త వయసు నుంచే ఎన్నో సినిమాలలో నటించింది. ఇక నాగార్జున,వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కూడా నటించింది. అయితే ఈమె రియల్ లైఫ్ లో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

భానుప్రియ సితార సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా తరువాత ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమెకి స్వర్ణకమలం అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. సినీ జీవితంలో, అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది భానుప్రియ.

కానీ ఈమె ఎన్నో కష్టాలను అనుభవిస్తూనే ఉంది. ఇక తను మొదట పరిచయం చేసిన దర్శకుడు వంశీ తో భానుప్రియ ప్రేమలో పడిందట. కానీ భానుప్రియ తల్లి మాత్రం వీరి ప్రేమను అంగీకరించలేదు. అందుకు గల కారణం ఏమిటంటే, ఆ డైరెక్టర్ కి ఇంతకుముందే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఒక వేళ తనకి అతనితో పెళ్లి చేస్తే రెండవ భార్య గాని మిగిలిపోతుందని తను అనుకోవడం తో వివాహం ఒప్పుకోలేదు.

ఇక వీరిద్దరూ ఆ కారణం చేతనే దూరమయ్యారట. ఇక డైరెక్టర్ వంశీ మటుకు ఆమె గురించి ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. కానీ హీరోయిన్ భానుప్రియ 1998 లో కౌశల్ అనే ఒక బిజినెస్ మాన్ లో పెళ్లి చేసుకుని , అమెరికాలో వెళ్లి సెటిల్ అయింది. ఇక వీరిద్దరికీ కలిసి ఒక పాప కూడా పుట్టింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరూ విడిపోవడం జరిగింది. దీంతో ఈమె ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను ఛత్రపతి సినిమా ద్వారా మొదలు పెట్టింది. ఇక కొంతకాలం తర్వాత భానుప్రియ భర్త చనిపోవడంతో ఆమె మానసికంగా ఎంతో కుంగిపోయింది. ఇక అంతే కాకుండా తర్వాత ఒక మైనర్ బాలిక విషయంలో ఆమె చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.