చిరు కెరీర్ లో వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అని మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎవరి అండా దండా లేకుండా స్వయం శక్తితో ఎదిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ తెలుగు ఇండస్ట్రీలో గర్వించదగ్గ నటులలో ఒకరిగా నిలిచారు. అలాంటి చిరంజీవి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ లాంటి అగ్ర హీరోలు ఉన్న సమయంలోనే వాడితో ధీటుగా సినిమాలు చేస్తూ వారందరికీ దాటుకొని నెంబర్ వన్ హీరో స్థాయికి చేరుకోవడం అంటే ఆషామాషీ కాదు.

అయితే చిరంజీవి ఇప్పటికే ఎన్నో సినిమాలను తీసుకున్నప్పటికీ వాటిలో ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి అన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా చిరంజీవికి ఒకానొక సమయంలో వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన కెరీర్లో భారీ బడ్జెట్ తో వచ్చిన సోషియో ఫాంటసీ, అంజి, శంకర్ దాదా ఎంబిబిఎస్, అందరివాడు,జై చిరంజీవ, శంకర్ దాదా జిందాబాద్ ఈ సినిమాలో చిరంజీవి భారీగా ప్లాప్ లను తెచ్చిపెట్టాయి. ఇక ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి కొద్దిగా విరామం ఇచ్చిన తరువాత ఖైదీ నెంబర్ 150 తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు.