టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అలా హీరో నాగచైతన్య నీ ప్రేమలో పడేసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అయినప్పటికీ సమంత రోజు ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తర్వాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ వెళ్తుంది.
ఇక పెళ్లి అయిన తర్వాత సమంత లో కొద్దిగా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే తాను ఈ సినిమాలో కథల ఎంపిక విషయంలో గానీ, అలాగే పాత్రల ఎంపిక విషయంలో గానీ పూర్తిగా వైవిధ్యం కనబరుస్తోంది.. అలాగే సినిమా ఏదైనా కూడా అందులో బలమైన పాత్ర ఉంటే చేయాలని డిసైడ్ అయిందట. అయితే ఈ నేపథ్యంలోనే సమంత బాలీవుడ్ లోకి ఎప్పుడు అడుగుపెట్టబోతోంది అని చాలామంది ఆమెను అడిగారట. ఇది ఇలా ఉంటే ఒకప్పుడు అదృష్టం అంతా సౌత్ ఇండస్ట్రీ మీదే అని చెప్పిన సమంత ప్రస్తుతం మాత్రం కొత్తదనం ఎక్కడ ఉంటే అక్కడ తప్పకుండా వెళ్దాం అని అంటోంది. దీనితో సమంత మాత్రం అదృష్టం లో పెట్టుకున్న దర్శక రచయితలు దానికి అనుగుణంగానే కథలను సిద్ధం చేస్తున్నారు.