బిగ్ బాస్ సీజన్ 5 పోటీదారుల కన్ఫార్మ్ లిస్ట్ ఇదే!

బిగ్ బాస్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. అయితే ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఈసారి ఐదవ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ షోకి ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సీజన్ ను ఆరంభించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట.

అయితే గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు వీరే అంటూ రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఎన్నో రకాల పేర్లు వినిపించినప్పటికీ ఈ పేర్లు మాత్రం ఫైనల్ అవుతున్నాయి అయినట్లు తెలుస్తోంది.షణ్ముఖ్ జస్వంత్, యాంకర్స్ రవి, వర్షిణి సౌందరరాజన్, ఆర్జే కాజల్, నటి సరయు, హీరోయిన్ ఇషా చావ్లా, డాన్స్ మాస్టర్స్ రఘు, అని, నటరాజ్, విజె లోబో, టీవీ నటుడు, విజె సన్నీ, నటీనటులు శ్వేతవర్మ, మానస్, సిరి హనుమంతు, నవ్యస్వామి, ఆట సందీప్, బాలనటుడు దీపక్ పాల్గొనబోతున్నారట.