జంగిల్ లో బిగ్‌బాస్.. ఆశ్చర్యపరుస్తున్న లేటెస్ట్ ప్రోమో!

హిందీలో బిగ్‌బాస్ 15వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా సల్మాన్ ఖానే హోస్టుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఒక ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో జంగిల్ లోని ఒక చెట్టు మాట్లాడటం చూడచ్చు. ఈ చెట్టుకి దిగ్గజ నటీమణి రేఖా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే ఆ చెట్టుతో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పకనే చెప్పేశారు.

అదేంటంటే, ఈసారి కంటెస్టెంట్లు తొలుత అడవిలాంటి ఒక సెట్అప్ లోకి అడుగు పెట్టాలి. ఈ జంగిల్ స్టేజ్ లోనే కొందరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన వారు హౌజులోకి వెళ్తారని తెలుస్తోంది. అయితే ఈ సారి బిగ్‌బాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తుందని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చెప్తున్నారు. ప్రస్తుతం వూట్(Voot) ప్లాట్‌ఫామ్‌ వేదికగా బిగ్ బాస్ ఓటీటీ ప్రసారమవుతోంది. అయితే ఇందులో పాల్గొన్న పార్టిసిపెంట్లలో కొందరు బిగ్‌బాస్ 15వ సీజన్లోనూ పాటిస్పేట్ చేస్తారని సమాచారం.