‘మా’కు భవనం అవసరం లేదు.. బండ్ల గణేష్ షాకింగ్ సలాహా!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే చాలామంది బరిలోకి దిగారు. ఇందులో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ల మధ్య పోటీ గట్టిగా ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. అయితే అందరి కంటే ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాను కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నానణి అంటూ ప్రకాష్ రాజ్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ కరోనా సమయంలో ఎంతో మందికి ఆశ్రయం కల్పించారని అందుకోసం నేను కూడా పది ఎకరాల భూమి ఇచ్చాను అంటూ గణేష్ తెలిపారు.

అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మా భవనం పలు వ్యాఖ్యలు చేశారు. నా దృష్టిలో అయితే మా కు బిల్డింగ్ అవసరం లేదు ఈ భవనం లేకపోయినంతమాత్రాన ఇండస్ట్రీ ఏమీ ఆగిపోదు. దానికంటే ముందుగా చేయాల్సింది చాలా ఉన్నాయి.900 మంది సభ్యులున్న ‘మా’లో దాదాపు వంద మంది దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నారు. నెల అయితే చాలు రెంటు ఎలా కట్టాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారి కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలి.అందులో ఈ వంద మందికి ఇళ్లు కట్టించాలి. దానికి మన హీరోలు కూడా ముందుకు వస్తారు అని బండ్ల గణేష్ తెలిపారు.