హీరో సుశాంత్ మాస్ స్టెప్పులు.. బండి తియ్?

హీరో సుశాంత్ నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమా ఆగస్టు 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలోని మాస్ సాంగ్ అయినా బండి తియ్ అనే సూపర్ సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటను అక్కినేని నాగచైతన్య రిలీజ్ చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రవీణ్ లక్కరాజు ఈ సినిమాకు సంగీతం అందించగా, సురేష్ గంగుల లిరిక్స్ అందించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి మరొక సాంగ్ రిలీజ్ అవగా ఆ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాను ఎన్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఇకపోతే సుశాంత్ విషయానికి వస్తే సుశాంత్ చివరిసారిగా చిలసౌ సినిమాలో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత సినిమాలకు చాలా గ్యాప్ తీసుకుని , కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకున్నాడు. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఇచ్చట వాహనాలు నిలుపరాదు అంటూ టైటిల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు సుశాంత్. ఈ సినిమాకు సంబంధించి బండి తియ్ అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.