డైలాగ్ లు మర్చిపోతున్న.. అమితాబ్ బచ్చన్ కన్నీళ్లు?

తాజాగా బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా చెహ్రే. ఈ సినిమాలో అమితాబచ్చన్ అలాగే ఇమ్రాన్ హీష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సస్పెన్స్ పిల్లల గా రూపొందింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో తమ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత ఆనంద్‌ పండిట్‌, బిగ్‌బీ, ఇమ్రాన్‌ హష్మీలు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ నిర్వహించారు. ఆపై సినిమాకు సంబంధించిన విషయాలపై ముచ్చటించారు.

ఈ సందర్భంగా బిగ్‌బీ మాట్లాడుతూ ‘సినిమాలు మనల్ని ఉత్సాహరుస్తుంటాయి. కొత్త సినిమా, స్రిప్ట్‌ నా ద్గగరికి వచ్చిందంటే చాలు మొదట ఇందులో నా పాత్ర, కథ ఏంటో తెలుసుకునేందుకు చాలా ఆసక్తి చూపుతాను. అలాగే ఈ సినిమాలో కూడా నా పాత్ర, కథ బాగా నచ్చటంతో ఒకే చెప్పాను అని తెలిపారు. అయితే ఇన్ని రోజులు కామెడీ చిత్రాల్లో నటించిన నేను ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా చేయలేదు. అయితే స్క్రిప్ట్‌ను ఎక్కువ రిహార్స‌ల్స్ చేయడంపై ప్రస్తావన రావడంతో అమితాబచ్చన్ స్పందిస్తూ ఈ మధ్య తాను పెద్ద పెద్ద డైలాగ్‌లు గుర్తు పెట్టుకోలేకపోతున్నానని, ఎక్కడ మర్చిపోతానోనని పదే పదే రిహార్సల్‌ చేస్తున్నాని చెప్పుకొచ్చారు. అంతేగాక వయసు రిత్యా మతిమరుపు పెరిగినట్టుంది అంటూ ఆయన చమత్కారించారు.