నాకు అంతా జీతం ఇవ్వరు బాబోయ్.. బిగ్ బి బాడీగార్డ్ క్లారిటీ!

సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వెళ్లాలంటే సెక్యూరిటీ గార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. అభిమానులు సెల్ఫీలంటూ వారిని చుట్టుముట్టేస్తారు. అందుకే చిన్నపాటి సెలబ్రిటీలు కూడా సెక్యూరిటీ గార్డులను మెయింటెన్‌ చేయాల్సిన పరిస్థితి. అలాగే బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా బయటకెళ్లాలంటే తన చుట్టూ సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి నీడలా సెక్యూరిటీ కల్పించారు ఒక బాడీగార్డు.

అయితే మామూలుగా సెలబ్రిటీల బాడీగార్డులు అంటే వారి జీవితం వేలల్లో లక్షల్లో ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలా అమితాబచ్చన్ కు జితేంద్ర షిండే అనే బాడీగార్డ్ ఉండేవాడు. ఆయన భార్యకు సొంత సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఉంది. ఇక గతంలో అమితాబ్‌ కోరిక మేరకు భారత్‌ పర్యటనకు వచ్చిన అమెరికన్‌ నటుడు ఎలిజా వుడ్‌కు కూడా షిండే రక్షణ కల్పించాడని సమాచారం. తనను నిరంతరం అంటిపెట్టుకుని ఉండే జితేంద్ర షిండేకు బిగ్‌బీ అక్షరాలా కోటిన్నర రూపాయలు ఇచ్చాడని బాలీవుడ్‌లో వరుస కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటున్నాడు షిండే. తాను ఇప్పుడు అమితాబ్‌ దగ్గర పని చేయడం లేదని స్పష్టం చేశాడు. 2015లో బిగ్‌బీకు బాడీగార్డుగా నియామకమయ్యానని, అయితే ఐదేళ్ల సర్వీసు తర్వాత తనను వేరేచోటకు ట్రాన్స్‌ఫర్‌ చేశారని చెప్పాడు.