అల్లు అర్జున్ ఫాలో అవుతున్న సల్మాన్ ఖాన్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక సల్మాన్ ఖాన్ అంటే ఎక్కడ విన్నా కూడా ఈ పేరు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక అలా వీరిద్దరూ స్టార్ హీరోలను చెప్పవచ్చు. ఇక మొన్న రీసెంట్ గా బన్నీ చేసినట్టు అంటే సిటీ మార్ సాంగ్ ని కూడా సల్మాన్ ఖాన్ ఏదో సినిమాలో రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరొక సారి కూడా అన్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది .ఆ విషయాలు ఏంటో చూద్దాం.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా అంతా ఫారెస్ట్ లో నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి . ఇక అంతే కాకుండా మహేష్ బాబు తో రాజమౌళి కూడా త్వరలోనే ఒక ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా తెరకెక్కించబోతున్న తెలుస్తోంది.

ఇంకా సల్మాన్ ఖాన్ కూడా ఈ మధ్యకాలంలో మాస్టర్ సినిమాలో నటించేందుకు , ఆ మూవీ రైట్స్ కొన్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ తో వస్తున్న పుష్ప లాంటి సినిమా కథను కూడా సల్మాన్ ఖాన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మార్కెట్ సినిమా రైట్స్ ని వేరే వాళ్ళకి ఇచ్చినట్లు సమాచారం. అయితే పుష్ప సినిమాను కూడా సల్మాన్ ఖాన్ హీరోగా నటించాలని అనుకున్నాడట . ఈ సినిమాకి 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.

అయితే మాస్టర్ సినిమాలో నటిస్తారా..? లేక పుష్ప సినిమాని చేస్తాడ అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు.