ఫ్యాష‌న్ లుక్‌లో ప్రియాంక‌ను కొట్టే వారే లేరు.. పిక్ వైర‌ల్‌..!

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారుండరు. అంతలా ఈ అమ్మడు తన స్టైల్ తో అభిమానుల మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఎల్లప్పుడూ ఈ ముద్దు గుమ్మ ఏదో ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ… తన అభిమానుల్ని అలరిస్తుంది. అలా ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టైలిష్ కాస్ట్యూమ్స్ ధరించి బ్యాగ్ పట్టుకొని హొయలొలికిస్తున్న ఈ అమ్మడు ఫొటోను చూసి నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. ఎంత మంది ముద్దుగుమ్మలు ఇండస్ర్టీకి వచ్చినా ప్రియాంక స్టైల్ ను బీట్ చేయలేరని అంటున్నారు. కాగా… ఈ బ్యూటీకి సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 66 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఒక్క వాణిజ్య ప్రకటన తన పేజీ ద్వారా చేస్తే అనేక మంది కోట్లు కుమ్మరిస్తున్నారు.