త‌న ముద్దుల కొడుకుతో స‌మంత ఆట‌లు..వీడియో వైర‌ల్‌!

అక్కినేని వారి కోడ‌లు స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం శాకుంత‌లంతో పాటు ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి పెట్స్ అంటే ఎంతో ఇష్ట‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా త‌న ఇంట్లో ఉండే హ‌ష్ అనే పెంపుడు కుక్కను స‌మంత సొంత కొడుకులా ట్రీట్ చేస్తుంటుంది.

షూటింగ్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన పెట్‌తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది సమంత. ఇక తాజాగా త‌న ముద్దుల కొడుకు హ‌ష్‌తో క‌లిసి గార్డెన్ ఏరియాలో బెలూన్ ఆట ఆడింది సామ్. ఓ బెలూన్‌ను సమంత పైకి ఎగిరేస్తుంటే.. హష్ సైతం పైకి ఎగిరి ఎగిరి తంతోంది.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోను స‌మంత త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజ‌న్లే కాదు.. మంచు లక్ష్మీ, రష్మిక, ప్రగ్యా జైస్వాల్‌ సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిన‌ట్టు కామెంట్స్ చేశారు.

https://www.instagram.com/reel/CRTjNjVgwim/?utm_source=ig_web_copy_link