త్వ‌ర‌లోనే పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన పీవీ.సింధు!

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి.. క్రీడాకారుల‌కు స్ఫూర్తిగా నిలిచింది పీవీ సింధు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఒలింపిక్ సన్నాహాల్లో మునిగిపోయింది. ఈ సారి ఖ‌చ్చితంగా బంగారు పతకంతోనే తిరిగివస్తానంటూ ధీమా వ్యక్తం చేసిన సింధు.. ప్రాక్టీస్ లో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

ఇదిలా ఉంటే.. సింధు పెళ్లి గురించి గ‌త కొంత కాలంగా అనేక వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌ళ్లీ సింధూ పెళ్లి తెర‌పైకి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఆమె వివాహం చేసుకోబోతోందంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ తెలుగు న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది.

తనకు అసలు పెళ్లి ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఇప్పట్లో పెళ్లి ప్రసక్తే లేదని, ఆటపైనే తన దృష్టి అని వెల్లడించింది. ఒకవేళ తన పెళ్లి కుదిరితే అందరికీ చెప్పే చేసుకుంటానని వివరించింది. మ‌రి ఇప్ప‌టికైనా సింధు పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌కు బ్రేక్ ప‌డుతుందో.. లేదో.. చూడాలి.