నాని డేరింగ్ స్టెప్‌..అలాంటి పాత్ర‌లో న‌టిస్తాడ‌ట‌?!

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన టక్‌ జగదీష్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. శ్యామ్ సింగ‌రాయ్ సెట్స్ మీద ఉంది. అలాగే అంటే సుందరానికి! చిత్రం త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది.

ఇదిలా ఉంటే.. నాని-గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో వచ్చిన జర్సీ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే హిట్ ఇచ్చిన గౌత‌మ్ తిన్న‌నూరితో నాని మ‌రో మూవీ చేయ‌నున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

యుద్దంలో కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి నిజ జీవిత చరిత్ర ఆధారంగా గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. ఆ సైనికుడి పాత్ర‌లో నాని క‌నిపించ‌నున్నాడ‌ట‌. అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందించ‌నున్నార‌ట‌. ఏదేమైనా కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి పాత్ర‌లో న‌టించ‌డమంటే.. నాని డేరింగ్ స్టెప్ తీసుకున్న‌ట్టే అవుతుంది.