త్వ‌ర‌లోనే నాలుగో పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన వనితా విజయ్ కుమార్!

వనితా విజయ్ కుమార్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా న‌టించిన వ‌నితా.. 2000లో నటుడు ఆకాష్‌ను పెళ్లాడి.. ముగ్గురు పిల్లలు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చింది. 2007లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఐదేళ్లకు కాపురం చేసి విడిపోయింది.

ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ళు సహజీవనం చేసి 2017లో అతడికీ బ్రేకప్ చెప్పేసింది. ఇక‌ లాక్‌డౌన్ టైమ్‌లో పీటర్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకోగా.. ఇది కూడా పెటాకులైంది. అయితే వ‌నితా త్వ‌ర‌లోనే నాలుగో పెళ్లి చేసుకోబోతోంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ ప్ర‌చారంపై వ‌నితా స్పందిస్తూ.. ఓ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. ఇకపై కూడా అలాగే ఉంటాను. ఇక పెళ్లి అనే ఆలోచన లేదు. దయచేసి నా జీవితం గురించి అసత్య ప్రచారాలు మాత్రం చేయకండి. నా గురించి మీరు వర్రీ అవ్వకండి. ముందు మీ జీవితం ఎలా ఉన్నాయో చూసుకోండి అంటూ చురకలు అంటించింది వ‌నితా.