భ‌ర్త‌తో లిప్‌లాక్ ఫొటోలు షేర్ చేసిన శ్రియ‌

June 17, 2021 at 1:26 pm

శ్రియ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. అయితే ఆ త‌ర్వాత స్పానిష్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రూ కోశ్చీవ్ ని వివాహం చేసుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత త‌న భ‌ర్త‌తో క‌లిసి దాదాపు మూడేళ్ల వ‌ర‌కు విదేశాల్లోనే ఉంది. ప్ర‌పంచ దేశాల్లో ప‌ర్య‌టించి భ‌ర్త‌తో ఎంజాయ్ చేసింది. కాగా ఇప్పుడు ఇండియాలోనే స్థిరపడుతోంది ఈ ముద్దుగుమ్మ‌.

ఇటీవ‌ల త‌న భర్తతో క‌లిసి ముంబైలో దిగిపోయిందని తెలిసింది. ఇదిలా ఉంటే శ్రీయ శ‌ర‌ణ్ తన రొమాంటిక్ లైఫ్ ని ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. ప్ర‌స్తుతం శ్రీయ త‌న సోషల్ మీడియాలో షేర్ చేసిన లిప్ లాక్ ఫొటోలు నెట్టింట సంచ‌ల‌నంగా మారాయి. త‌న భ‌ర్త ఆండ్రూని డీప్ కిస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రియ‌కు సంబంధించిన నాలుగు ఫోటోలు విప‌రీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలో త‌న భ‌ర్త‌కు డీప్ లిప్ లాక్ ఇస్తోంది శ్రియ.

భ‌ర్త‌తో లిప్‌లాక్ ఫొటోలు షేర్ చేసిన శ్రియ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts