ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ వచ్చే ఏడాదేనా…?

June 17, 2021 at 1:04 pm

టాలీవుడ్ లో మోస్ట్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది రాజమౌళియేనని చెప్పాలి. ఆయన ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా ఆయన నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతోందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అయితే కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ మొదలైంది. కరోనా వల్ల థియేటర్లు మూతపడటం, సినిమా షూటింగులు ఆగిపోవడంతో ఈ సినిమా రిలీజ్ తేది వాయిదా పడుతూ వస్తోంది. ఇలా రెండు సార్లు ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది.

ఇప్పుడు ఈ సినిమాపై మరో కొత్త డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించింది. దరసా కానుకగా ఈ సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమారిలీజ్ డేజ్ ను అనౌన్స్ చేశారు. వచచే సంవత్సరం జనవరి నెల 26వ తేదీన సినిమా విడుదల చేయాలని జక్కన్న యూనిట్ భావిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ వచ్చే ఏడాదేనా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts