సత్య నాదెళ్ల మరో ఘనత..!

స‌త్య‌నాదెళ్ల అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌ముఖ మైక్రో సాఫ్ట్ కంపెనీ సీఈవోగా సత్య నాదెళ్ల ఇప్ప‌టికే ఎన్నో ఘనతలు సాధించారు. అయితే ఇప్పుడు ఆయ‌న మ‌రో రికార్డు నెల‌కొల్పారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో స‌త్య నాదెళ్ల అధికార బాధ్యతలు బాగా పెరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా ఉన్న నాదెళ్ల ఇప్ప‌డు కంపెనీకి ఛైర్మన్‌గానూ ఎన్నికయ్యారు.

మైక్రో సాఫ్ట్ సంస్థ‌కు కొత్త చైర్మన్‌గా సత్య నాదెళ్లను ఎంపిక‌చేసి నియ‌మిస్తూ బుధవారం ఆ కంపెనీ ఉత్త‌ర్వ‌లు జారీచేసింది. బోర్డు ఛైర్మన్‌గా నాదెల్ల‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స‌భ్యులు వెల్లడించారు. ప్రస్తుత ఛైర్మన్ గా ఉన్న జాన్ థామ్సన్ ప్లేస్‌లో త్వరలోనే నాదెళ్ల బాధ్యతలు తీసుకుంటార‌ని తెలుస్తోంది. అప్పుడు థామ్సన్ స్వతంత్ర డైరెక్టర్‌గా ఉంటార‌ని స‌భ్యులు ప్ర‌క‌టించారు. ఇక 1975లో మైక్రో సాఫ్ట్‌లో చేరిన స‌త్య‌నాదెళ్ల‌.. 2014లో సీఈవోగా ఎంపిక‌యి సంచ‌ల‌నం సృష్టించారు. కంపెనీని కొత్తతరం టెక్నాలజీ వైపు నడిపించి స‌మ‌ర్థ‌త‌ను చాటారు. అంతే కాదు క్లౌడ్‌ కంప్యూటింగ్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్ట‌డంతో ఆయ‌న పాత్ర మ‌రింత పెరిగింది.