కరీంనగర్ లో వింత ఘటన..మ‌నిషిలా అరుస్తున్న పాము?!

June 7, 2021 at 2:09 pm

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పాము మ‌నిషిలా అరుస్తున్నదంటూ ఓ యువకుడు వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త‌ వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ విష‌యం రాష్ట్ర మొత్తం హాట్ టాపిక్‌గా మారింది.

అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. అస‌లు విష‌యం తెలుసుకుని ఇదంతా అబద్దమని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక అస‌లు విష‌యం ఏంటంటే..ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో హోంగోస్‌ హిట్స్‌ ద హై నోట్స్ అనే పేరుతో అప్‌లోడ్ చేశాడు.

ఆ వీడియోనే డౌన్ లోడ్ చేసి.. వెలిచాలలో జ‌రిగింద‌ని పేర్కొంటూ ఓ ఆకతాయి యువకుడు వైర‌ల్ చేశాడు. ఇక మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ వీడియోలో క‌నిపిస్తున్న పామును ఈస్టర్న్‌ హాగ్‌నోస్‌ స్నేక్ అంటారు. ఇది కేవలం నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

కరీంనగర్ లో వింత ఘటన..మ‌నిషిలా అరుస్తున్న పాము?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts