ర‌స‌వ‌త్త‌ర పోరు..`మా` ఎన్నిక‌ల బ‌రిలో న‌టి హేమ?!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌, మంచు వారి అబ్బాయి మంచు విష్ణు తో పాటు జీవితా రాజ‌శేఖ‌ర్ కూడా పోటీలో దిగిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ రేసులో సీనియ‌ర్ న‌టి హేమ‌ పేరు కూడా వ‌చ్చి చేరింది. అధ్యక్ష పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్టు హేమ ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పదవులను చేపట్టాను. ఈసారి ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని అనుకున్నాను. ఎల‌క్షన్ ముందు ఆలోచ‌న ఇది. కానీ ఆలోచ‌న మారింది.

సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి వస్తోందని… నువ్వెందుకు పోటీ చేయకూడదని ఫోన్లు చేసి అడుగుతున్నారు. అయితే గత ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు తనకు అండగా నిలిచిన వారికోసం… ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.