సమంత మనసుపడ్డ బ్యాగ్‌ ధర ఎంతంటే..?

samantha

సెలెబ్రిటీలు వేసుకునే డ్రెస్ నుంచి చెప్పులు గాగుల్స్ ఇలా అన్ని పెద్ద విషయమే. ఇక వాళ్ళు ఎక్కడ కనిపించిన సెల్ఫీల కోసం వాళ్ళ వెంటపడుతుంటారు. అదే సమయంలో వాళ్ళు ధరించిన క్లాత్స్ గురించి వాళ్ళ చేతిలో ఉన్న వస్తువుల గురించి కూడా సెర్చ్ చేస్తుంటారు. అంతేకాకుండా స్టార్ హీరోహీరోయిన్లు వాడుతున్న కార్లు, దుస్తులు, బ్యాగ్స్ అన్ని ఖరీదుగానే ఉంటాయి.

నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతా తెర మీద అందాలనటే కాదు.. స్టయిల్‌ ఐకాన్‌ కూడా. దేశీ చేనేతకు ఎంత దర్జానివ్వగలదో ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌కూ అంతే గ్లామర్‌నిస్తుంది. ఏ డిజైన్‌ అయినా సమంతా కోసం పోటీపడాల్సిందే. పై ఫొటోలో ఆ పోటీలో గెలిచిన బ్రాండ్స్‌ ఇవి. లూయి విట్టోన్‌ బై మెటీరియల్‌ డ్రస్‌ ధర: రూ. 2,01,773, సన్‌ లోరాన్‌ ట్రిబ్యుట్‌ ఫ్లాట్‌ఫాం శాండిల్స్‌ ధర: రూ. 85,000, లూయి చైన్‌ బ్యాగ్‌ ధర: రూ. 15,600 ఉంటుంది. ఇక సమంత లూయి విట్టోన్‌ బ్యాగ్‌ కొనుక్కోవాలని మనసుపడ్డానని తెలిపింది. ఇక ఆ బుజ్జి బ్యాగ్‌ ధర ఎంతో తెలుసా? 30 థౌజెండ్‌ రూపీస్‌ ఓన్లీ. ఆ కాలాన్ని ఫాస్ట్‌ఫార్వడ్‌ చేస్తే అది ఇప్పటికీ నా ఫేవరేట్‌ అంటూ చెప్పుకొచ్చింది.