65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సల్మాన్ సినిమా..?

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఏ సినిమా చేసినా అదొక ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుందే. అలాంటి నేష‌న‌ల్ టాప్ హీరో న‌టించిన సినిమా రాధే. ఈ సినిమా మొద‌లైన‌ప్ప‌టి ఉంచి ఎన్నో అంచ‌నాలుండేవి. ఇప్పుడు రిలీజై ఓ స‌రికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాలు అన్నీ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యేవి.

లేదంటే ఓటీటీలో వ‌చ్చేవి. కానీ రాధే మాత్రం ఒకేసారి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. భారీ హైప్‌తో డిజిటల్ వ్యూస్‌ భాగానే వచ్చినా.. సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ రాధే జోరు మాత్రం ఎక్క‌డా తగ్గటం లేదు. అయితే ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేయ‌డానికి రెడీ అవుతోంది. ఇప్పటికే థియేటర్లతో పాటు జీ5, జీప్లెక్స్ ఓటీటీ కేట‌గిరీల్లో విడుద‌లైంది. ఇప్పుడు యాపిల్ టీవీలోనూ విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ ప్లాట్‌ ఫామ్‌లో దాదాపు 65 దేశాల్లో ఆడుతుంద‌ని స‌మాచారం.