అదిరిన మ‌హేష్ న్యూ లుక్‌..వైర‌ల్‌గా మారిన పిక్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా క‌నిపించ‌డం మ‌హేష్‌కే సొంతం. అందుకే అభిమానుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం మ‌హేష్ అందానికి ఫిదా అవుతుంటారు.

ఇక తాజాగా మ‌హేష్ కూతురు సితార‌తో దిగిన‌ న్యూ పిక్ ఒక‌టి బ‌య‌టకు వ‌చ్చింది. ఈ ఫొటో చూస్తే.. ఏమున్నాడురా బాబు అని అన‌కుండా ఉండ‌లేరు. అవును, ఈ పిక్‌లో సితార త‌న క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటుండ‌గా.. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని లాంగ్ హెయిర్, గడ్డం మీసాలతో మహేష్ సూప‌ర్‌ స్టైలిష్ గా క‌నిపించారు.

ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్‌ త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

 అందులో ముఖ్యంగా మహేష్ బాబు అయితే రోజూ తన టైమ్ టేబుల్ కూడా సెట్ చేసుకున్నాడు. కరోనా సమయంలో ఏం చేయాలో అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అలాగే చేస్తున్నాడు కూడా. అందులో పిల్లలతో ఆడుకోవడం కీలకం.<br />