అర‌రే..కంగ‌నాను అక్కడ కూడా ఉండ‌నిచ్చేలా లేర‌ట‌!

May 10, 2021 at 12:39 pm

బాలీవుడ్ న‌టి, కంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా ఇటీవ‌లె సస్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో కంగ‌నా ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే తాజాగా కంగ‌నా క‌రోనా బారిన ప‌డ‌టంతో.. ఆ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా చిన్న ఫ్లూ మాత్ర‌మే. అన‌వ‌స‌రంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భ‌య‌ప‌డ‌కండి. అంద‌రం క‌లిసి దీనిని నాశ‌నం చేద్దామ‌ని కామెంట్ పెట్టింది. దీంతో నెటిజ‌న్లు ఆమె పోస్ట్ పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేశారు. ప్ర‌తి రోజు వేల మందిని బ‌లితీసుకుంటున్న క‌రోనా చిన్న ఫ్లూనే అంటావా అంటూ ఆమెపై విరుచుకుప‌డ్డారు.

దీంతో వెంట‌నే ఇన్‌స్టా ఆమె పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఇదే విష‌యాన్ని కంగ‌నా త‌న స్టోరీలో చెబుతూ.. కొవిడ్‌ను నాశ‌నం చేస్తా అన్నందుకు కొంత మంది హ‌ర్ట్ అయ్యార‌ట‌. ఇన్‌స్టాకు వ‌చ్చి రెండు రోజులైంది కానీ ఇక్క‌డ కూడా వారం కంటే ఎక్కువ ఉండ‌నిచ్చేలా లేరు అని సెటైర్లు పేల్చింది.

అర‌రే..కంగ‌నాను అక్కడ కూడా ఉండ‌నిచ్చేలా లేర‌ట‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts