అనుష్కపై మనసు పడ్డ బాలీవుడ్ స్టార్..?

anuhska-shetty

చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసింది అనుష్కా. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరితో జతకట్టింది. ఇక అరుందతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క. అప్పటి నుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఇక అనుష్క మీద బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మనసు పారేసుకున్నట్లు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనుష్క తో నటించాలని రణ్ బీర్ తహతహలాడుతున్నాడట. రణబీర్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే మూవీ చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించే ఈ సినిమా మూడు భాగాలుగా రానుంది. ఎలాగూ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి మూడు భాగాల్లో ఏదొక భాగంలో అనుష్క ను తీసుకుంటే రణబీర్ కోరిక నెరవేరుతుందని బాంబే వర్గాల్లో ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు.