దాని కోసం ఏకంగా తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం..?

May 1, 2021 at 12:37 pm

దేశంలో ఆడబిడ్డల పై అత్యాచారాలు నేటికీ ఆగడం లేదు.తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో చిన్న బాలిక పై ఘోరం జరిగింది. గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్ మండలంలో తొమ్మిది సంవత్సరాల బాలిక పై ఓ మృగం అత్యాచారం చేసాడు. దీనికి పంచాయతీ పెద్దలు ఎకరం భూమి పరిహారం ఇచ్చి నేరాన్ని మాఫీ చేయాలనుకున్నారు. కానీ తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి ఇలా భూమి ఇచ్చి పరిహారం చెయ్యటం సహించలేని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా దగ్గర లోనే ఉండే 35 ఏళ్ల ఓ వ్యక్తి మాయ మాటలు చెప్పి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న తమ బిడ్డ కనిపించకపోవడంతో వెతికిన బాలిక తల్లిదండ్రులు జరిగిన దారుణాన్ని తెలుసుకొని నిందితుని పట్టుకుని గ్రామంలో పంచాయితీ నిర్వహించి విషయం సద్దుమణిగే ప్రయత్నం చేశారు. జరిగిన అత్యాచారానికి పరిహారంగా భాదితురాలి కుటుంబానికి ఎకరం భూమి ఇప్పిస్తామని గ్రామా పెద్దలు తీర్పు చెప్పారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి పంచాయతీ పెద్దల తీర్పుకు సహించలేని తల్లిదండ్రులు స్థానిక ఆలంపూర్ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

దాని కోసం ఏకంగా తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts