అబ్బాయికి 17, అమ్మాయికి 20..చివరికి..?

May 30, 2021 at 2:48 pm

17 ఏళ్ల అతను 20 ఏళ్ల ఆమె ప్రేమలో పడ్డారు. ఓ గదిలో కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు. వారం క్రితం వివాహం కూడా చేసుకున్నారు. కానీ అనుకోకుండా వారి జీవితంలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే, యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్న బాలాజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అదే ప్రాంతంలో ఉంటూ సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న నీలిమతో బాలాజీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా చివరకు ప్రేమగా మారింది. కానీ వీళ్లిద్దరి ప్రేమకు పెద్దల ఒప్పుకోకపోవడంతో వారిద్దరు జవహర్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకొని సహ జీవనం చేయటం మొదలు పెట్టారు.

వారం రోజుల క్రితం గదిలోనే వివాహం కూడా చేసుకున్నారు. అయితే అగస్మాతుగా ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలిదు కానీ ఇద్దరు తరచుగా గొడవలు పడేవారు. ఈ క్రమంలోనే శనివారం నాడు ఇద్దరు ఫ్యాన్‌కు ఊరేసుకుని చనిపోటానికి ప్రయత్నం చేశారు. అయితే యువతి చున్నీ ఉడిపోవడంతో ఆమె కింద పడిపోయింది.కానీ బాలాజీ మెడకు ఉరి బిగిసుకోని చనిపోయాడు.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసు శాఖవారు ఘటన స్థలానికి చేరుకుని అన్ని వివరాలు తీసుకున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నారు.

అబ్బాయికి 17, అమ్మాయికి 20..చివరికి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts