డ్యాన్స‌ర్‌గా మారిన సింగ‌ర్ సునీత‌..వీడియో వైర‌ల్‌!

April 17, 2021 at 9:23 am

టాలీవుడ్ టాప్ సింగ‌ర్స్‌లో ఒక‌రైన సునీత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కేవ‌లం సింగ‌ర్‌గానే కాకుండా టెలివిజన్‌ యాంకర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది సునీత‌.

ఇక ఇటీవల రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన‌ సునీత.. ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సింగ‌ర్ డ్యాన్స‌ర్‌గా మార‌బోతోంది.

ఎప్పుడూ గాత్రం మీద కాన్‌సన్‌ట్రేట్ చేస్తూ రికార్డింగ్ స్టూడియోల్లో కనిపించే సునీత.. ఇప్పుడు కొత్తగా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌తో బిజీగా వున్నారు. మ‌రి ఏదైనా టీవీ షో కోసం డ్యాన్స్ నేర్చుకుంటున్నారా.. లేదా ఇంకేమైనా ఉందా అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం సునీత డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో వైర‌ల్‌గా మారింది.

డ్యాన్స‌ర్‌గా మారిన సింగ‌ర్ సునీత‌..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts