పవ‌న్‌కు క‌రోనా..వ‌‌ర్మ ఘాటు వ్యాఖ్య‌లు!

April 17, 2021 at 9:58 am

ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌లో క‌రోనా క‌ల్లోలం రేపుతోంది. ఇప్ప‌టికే ఎంత‌రో సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా క‌రోనా సోకింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది. అయితే ప‌వ‌న్‌కు క‌రోనా సోక‌డం పై టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్, వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వ‌ర్మ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

` ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయ స్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? చెప్పండి యువర్ ఆనర్` అంటూ వకీల్ సాబ్‌పై సెటైర్ వేసిన‌ వ‌ర్మ‌.. మ‌రో ట్వీట్‌లో మ‌రో ట్వీట్‌లో `వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం పవన్ ఇలా మంచాన పడడానికి కారణం కొవిడ్ కాదని, వకీల్ సాబ్ వసూళ్లు అని అంటున్నారని, అందరూ కదిలి ప్రాణాలకు తెగించి పీకే జేబుల్ని నింపండి` అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశాడు.

అక్క‌డితో ఆగ‌ని వ‌ర్మ‌..ప‌వన్ విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో షేర్ చేసి ఇందులో `ఫేక్` ఉంద‌ని..అది ఏమిటో చెప్పాలని, ఆ తప్పును బయటపెట్టిన వారి ఫొటోను తాను పోస్టు చేసి రివార్డు ఇస్తానని వర్మ ఆఫర్ చేశాడు. ఆర్ట్ డైరెక్షన్‌లో ఒక తప్పుందని, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ను అడిగైనా సరే ఆ తప్పేంటో చెప్పించాలని రాజమౌళిని కూడా కోరాడు. మొత్తానికి వ‌ర్మ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారియి.‌

పవ‌న్‌కు క‌రోనా..వ‌‌ర్మ ఘాటు వ్యాఖ్య‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts