వాట్సాప్ నెంబ‌ర్ అడిగిన నెటిజ‌న్‌..శ్రుతిహాస‌న్ దిమ్మ‌తిరిగే రిప్లై!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఇంస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ అమ్మ‌డు రేంజే మారిపోయింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ర‌వితేజ `క్రాక్‌`తో రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. సూప‌ర్ హిట్‌ను అందుకుంది.

అలాగే తాజాగా `వ‌కీల్ సాబ్‌`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న శ్రుతి.. ప్ర‌స్తుతం ప్రభాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `స‌లార్‌`లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈమె తాజాగా అభిమానుల‌తో చిట్‌చాట్ చేసింది.

ఈ క్ర‌మంలోనే వారు అడిగే అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పింది. అయితే ఓ నెటిజ‌న్‌.. మీ వాట్సాప్ నంబ‌ర్ ఇవ్వ‌రా అని కోరాడు. అందుకు శ్రుతి దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చింది. ఇంత‌కీ ఏం చెప్పిందో తెలిసా..100 అంటూ పోలీస్ కంట్రోల్ రూం నంబ‌ర్ చెప్పింది. దీంతో స‌ద‌రు నెటిజ‌న్లు సైలెంట్ అయిపోయారు. మొత్తానికి శ్రుతి ఇచ్చిన ఫ‌న్నీ రిప్లై ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.