వెబ్ సిరీస్ బాట ప‌ట్టిన టాలీవుడ్ హాట్ బ్యూటీ?!

టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన పాయ‌ల్‌.. మొద‌టి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌లో న‌టించిన పాయ‌ల్‌.. ప్రేక్ష‌కుల‌కు తెగ ఆక‌ట్టుకంది.

ఈ చిత్రం త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసినా.. పాయ‌ల్‌కు మంచి హిట్ అయితే ద‌క్క‌లేదు. దీంతో ప్ర‌స్తుతం ఈ భామ వెబ్ సిరీస్ బాట ప‌ట్టింద‌ట‌. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో రూపొందిస్తున్న త్రీ రోజెస్ వెబ్ సిరీస్ లో పాయల్ అవకాశం దక్కించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్‌లో కూడా పాయ‌ల్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో చేస్తోందట. ఆమె విలనిజమే ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఈ బ్యూటీ సినిమాలలో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. వెబ్ సిరీస్ లలో సత్తా చాటుతుందేమో చూడాలి.