`వీరమల్లు` కోసం శూలంతో పవన్ క‌స‌ర‌త్తులు..వైర‌ల్‌గా ఫొటోలు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `హరిహర వీరమల్లు` ఒక‌టి. క్రిష్ జాగ‌ర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తోంది. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం సమర్పణలో ఎ. ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Image

పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌ం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను లుక్‌ను, సినిమా టైటిల్‌ను విడుదల చేసింది. అలాగే విడుదల చేసిన గ్లిమ్స్‌లో పవన్ శూలంను అవ‌లోల‌గా తిప్పుతూ అద‌రగొట్టారు.

Image

అయితే ఆ సీన్ కోసం పవన్ చేసిన రిహార్సల్స్‌కు చెందిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ప‌వన్ శూలంతో క‌స‌ర‌త్తులు చేస్తూ కనిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ అభిమానుల‌ను ఈ ఫొటోలు తెగ ఆక‌ట్టుకుంటున్నాయి.

Image

Image