ఎట్ట‌కేల‌కు ఫిక్స్ అయిన అనుష్క పెళ్లి..అబ్బాయి ఎవ‌రంటే?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూప‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.

గ‌తంలో ఈమె పెళ్లి ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ప్ర‌భాస్‌తో అనుష్క పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని ఎన్నో సార్లు వార్త‌లు వ‌చ్చినా.. అవి రూమ‌ర్లుగానే మిగిలాయి. ఇక అనుష్క పెళ్ళి వార్తలపై విసుగు చెందిన ఆమె తల్లిదండ్రులు ఎట్టికేలకు ఆమెకి వివాహం చేయాలని నిశ్ఛయించార‌ట‌. ఈ క్ర‌మంలోనే వ‌రుడి వేడిలో ప‌డిన అనుష్క పేరెంట్స్‌కు ఓ అబ్బాయి దొరికినట్లు సమాచారం.

ఆ అబ్బాయి దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుగా తెలుస్తోంది. అత‌డు అనుష్క కంటే చిన్న‌వాడే. అయిన‌ప్ప‌టికీ ఆ అబ్బాయితోనే అనుష్క పెళ్లి నిశ్చ‌యించార‌ని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వేగంగా విస్త‌రిస్తోంది. అందుకే కొన్ని నెల‌లు ఆగి అనుష్క వివాహం చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.