నాగార్జున వ‌ర్సెస్ అనుష్క‌…. త‌ప్ప‌దా..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న జేజ‌మ్మ అనుష్క ఈ రోజు ఈ రేంజ్‌లో ఉందంటే దానికి కార‌ణం కింగ్ నాగార్జునే అన్న‌ది ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిన విష‌యం. సూప‌ర్ సినిమాతో అనుష్క‌ను హీరోయిన్‌ను చేస్తే ఈ రోజు అనుష్క టాలీవుడ్ జేజ‌మ్మ‌గా ఓ టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్ర‌స్తుతం అనుష్క సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌.

నాగార్జున అంటే అనుష్క‌కు ఎంతో రెస్పెక్ట్‌. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున వ‌ర్సెస్ అనుష్క ఈ ఇద్ద‌రి మ‌ధ్యా అదిరిపోయే ఫైట్ జ‌ర‌గ‌నుంది. అయితే ఇది రీల్ లైఫ్‌లో కాదు..రియల్ లైఫ్‌లో..! ఇక అసలు మ్యాట‌ర్‌కు వస్తే యూవీ క్రియేష‌న్స్ పెద్ద హీరోల‌ను, పెద్ద సినిమాల‌ను అస్సలు లెక్కేచేయ‌డం లేదు. వ‌రుస‌గా చిన్న సినిమాలు తీస్తూ పెద్ద హీరోలు, పెద్ద సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తూ హిట్లు మీద హిట్లు కొడుతున్నారు.

తాజాగా ఈ బ్యాన‌ర్ నుంచి పిల్ల జ‌మిందార్ డైరెక్ట‌ర్ అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో భాగ‌మ‌తి సినిమా తెర‌కెక్కింది. ఎప్ప‌టి నుంచో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా గ్రాఫిక్స్ వ‌ర్క్ కార‌ణంగా లేట్ అయ్యి… ఎట్ట‌కేల‌కు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను డిసెంబ‌ర్ మూడో వారంలో రిలీజ్‌కు యూవీ క్రియేష‌న్స్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమా డిసెంబ‌ర్ 23న వ‌స్తుంటే అదే రోజున నాగార్జున నిర్మాత‌గా త‌న త‌న‌యుడు అఖిల్ హీరోగా తెర‌కెక్కుతోన్న హ‌లో సినిమా కూడా వ‌స్తోంది. బాహుబ‌లి త‌ర్వాత అనుష్క నుంచి వ‌స్తోన్న సినిమా కావడంతో భాగ‌మ‌తి మీద భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక అటు అఖిల్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత ఎన్నో అంచ‌నాల‌తో అఖిల్ హ‌లో వ‌స్తోంది. మ‌రి ఇటు కొడుకు సినిమాతో నిర్మాత‌గా నాగార్జున‌, అటు అనుష్క ఇద్ద‌రూ బాక్సాఫీస్ వ‌ద్ద ఫైట్‌కు రెడీ అవుతున్నారు. మ‌రి వీరిలో ఎవ‌రు పైచేయి సాధిస్తారో ? చూద్దాం.