‘ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ ‘ లో చంద్ర‌బాబు రోల్‌కు ఆ హీరో ఫిక్స్‌

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ సంచ‌ల‌నం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు అయిన ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌లో చివ‌రి అంకాన్ని బేస్ చేసుకుని వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై అప్పుడే కాంట్ర‌వ‌ర్సీ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ బయోపిక్ ను లక్ష్మీ పార్వతి కోణంలోంచి తీస్తానని ఆరంభంలోనే బాంబు పేల్చిన వర్మ ముఖ్య పాత్రల కోసం నటీనటుల్ని ఎంచుకునే పనిలో ఉన్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వ‌తితో పాటు ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లు కీల‌కం కానున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ చివ‌రి జీవితంలో అటు భార్య ల‌క్ష్మీపార్వ‌తి, ఇటు చంద్ర‌బాబే చ‌క్రం తిప్పారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు ల‌క్ష్మీపార్వ‌తి చ‌క్రం తిప్పితే, ఆ త‌ర్వాత ఆయ‌న్ను సీఎం ప‌ద‌వి నుంచి దించేసి సీఎం అవ్వ‌డంలో చంద్ర‌బాబు చ‌రిత్ర తెలిసిందే.

ఇక ఈ సినిమాలో చంద్ర‌బాబు పాత్ర కీల‌కం కావ‌డంతో ఈ రోల్‌కు వ‌ర్మ ఓ వ్య‌క్తిని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు వ‌ర్మ‌కు అత్యంత స‌న్నిహితుడు, హీరో జేడి.చ‌క్ర‌వ‌ర్తి అని స‌మాచారం. జేడీ అయితే చంద్ర‌బాబు పాత్ర‌కు లుక్స్ ద‌గ్గ‌ర‌నుంచి బాడీ లాంగ్వేజ్ వ‌ర‌కు క‌రెక్టుగా సెట్ అవుతాడ‌ని వ‌ర్మ భావిస్తున్నాడ‌ట‌.

ఈ సినిమా విష‌యంలో స్టార్టింగ్ నుంచి ఎన్నో బాంబులు పేల్చుతోన్న వ‌ర్మ ఇప్పుడు చంద్ర‌బాబు రోల్‌కు జేడి.చ‌క్ర‌వ‌ర్తిని తీసుకుని మ‌రో బాంబు పేల్చాడు. మ‌రి సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లేటైంకు ఇంకెన్ని బాంబులు పేలుస్తాడో ? చూడాలి.