ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్‌: ప‌వ‌న్‌కు ఈ కొత్త పేరేంట‌ని షాక్ !

ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్‌. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో ప‌వ‌ర్‌స్టార్‌గా, జ‌న‌సేనానిగా అంద‌రూ పిలుచుకుంటోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరు మారిపోయింది. ప‌వ‌న్‌కు ఈ కొత్త పేరేంట‌ని షాక్ అవుతున్నారా ?  ఆ పేరు కుషాల్ బాబు. ప‌వ‌న్ పేరు ఎవ‌రు మార్చారు ?  ఎందుకు మారింద‌న్న ప్ర‌శ్న‌కు మ‌న‌కు షాకింగ్ ఆన్స‌ర్ వ‌చ్చింది.

ప‌వ‌న్ పేరును ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జం గూగుల్ మార్చేసింది. అయితే ప‌వ‌న్ పేరును గూగుల్ ఎందుకు మార్చేసింది అన్నది మాత్రం తెలియట్లేదు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఈ క్రేజీ మూవీలో ప‌వ‌న్‌కు కుషాల్ బాబు అన్న పేరు ఉంటుందా ?  లేదా మ‌రే కార‌ణంతో ఈ పేరు మారింద‌న్న‌దానిపై ప్ర‌స్తుతం హాట్ హాట్‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప‌వ‌న్ ముందు క‌ళ్యాణ్ అది త‌ర్వాత పవన్ కళ్యాణ్ అయ్యింది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పవర్ స్టార్ అయ్యారు. 

ఇక ఇప్పుడు కానీ కుషాల్ బాబు ఎందుకు అయ్యారన్నది మాత్రం తెలియట్లేదు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో పేరు అనుకుందామా? ఎవ్వరికీ తెలియకుండా గూగుల్‌కి మాత్రమే ఎలా తెలుస్తుందనేది తెలియట్లేదు. గూగుల్‌లో పవన్ పేరు మార్పును చూసిన ఫ్యాన్స్ అసలు కుషాల్‌గా ఎందుకు మార్చారా? అని షాక్ అవుతున్నారు.