జ‌గ‌న్ ఒక్క మ‌గాడ‌ట‌! హీరోయిన్ స్టేట్‌మెంట్ అదిరింది

వైసీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ అన‌ని, విన‌ని కామెంట్ ఒక‌టి మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. జ‌గ‌న్ అంటే ఒక్క మ‌గాడ‌ని తెగ మురిసిపోతూ చెబుతోంది హీరోయిన్ సునీతా రాణా! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజ‌మ‌ని ఈ అమ్మ‌డు ఒట్టేసి మ‌రీ చెబుతోంది. జ‌గ‌న్‌ని అస‌లు ఈ కోణంలోనే ఆలోచించ‌ని అనేక మంది ఇప్పుడు ఆ దిశ‌గా త‌మ ఆలోచ‌న‌ను సాగిస్తున్నారు. నిజానికి జ‌గ‌న్ మంచి య‌వ్వ‌నంలో ఉన్న మాట వాస్త‌వ‌మే క‌దా అంటున్నారు. మంచి ఎత్తు, అంత‌కు మించిన మంచి ఛెస్ట్ జ‌గ‌న్‌ను చూడ‌గానే అచ్చం మ‌న ప‌క్కింటి అబ్బాయిలాగే అనిపిస్తాడ‌ని చెవులు కొరుక్కొంటుండ‌డం విశేషం.

దీనికితోడు జ‌గ‌న్‌కి ఎలాంటి చెడు అల‌వాట్లూ లేక‌పోవ‌డం ప్ల‌స్సుల మీద ప్ల‌స్సులు వేసేసింది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ అంటే విప‌క్ష నేత‌గానో, చంద్ర‌బాబు పై విరుచుకుప‌డే వ్య‌క్తిగానోఅంద‌రూ చూస్తున్నారు. కానీ, సునీతా స్టేట్ మెంట్‌తో అంద‌రూ ఒక్క‌సారిగా జ‌గ‌న్‌లో ఉన్న యూత్ కేరెక్ట‌ర్‌పై క‌న్నేశారు. జగన్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అభిమానులున్నారో అంద‌రికీ తెలిసిన విష‌యమే. తాజాగా జగన్ అభిమానుల జాబితాలో హీరోయిన్లు చేరడంపై వైసీపీ నేతలు మురిసి పోతున్నారు. ఈ క్ర‌మంలోనే అస‌లు ఈ సునీత ఎవరో తెలుసుకునేందుకు గూగుల్ గురులో వెతుకులాట ప్రారంభించేశారు.

పంజాబ్‌లో పుట్టి పుణేలో పెరిగి మోడల్ కమ్ హీరోయిన్ అయిన సునీతా రాణా తెలుగు, తమిళంలో హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే తనకు రాజకీయాలు అంటే ఇష్టమని, అందుకే నిత్యం వార్తలు చూస్తానని, వాటిలో వైఎస్ జగన్ ను సభలు పెట్టినప్పుడు వచ్చే జనాన్ని చూసి ఫిదా అయిపోయినట్లు జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. అంతేకాదు రాజకీయాల్లో వచ్చే యువత జగన్ ను రోల్ మోడల్ పెట్టుకోవాలని సూచించింది. దీంతో ఇప్పుడు వైసీపీలో ఎక్క‌డా లేని జోష్ క‌నిపిస్తోంది.

Sunitha Rana and YS Jagan