నితిన్ ‘ లై ‘ ప్రీమియ‌ర్ షో టాక్ వ‌చ్చేసింది… సినిమా ఎలా ఉందంటే

యంగ్ హీరో నితిన్ అ..ఆ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత నితిన్ న‌టించిన సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కృష్ణగాడి వీరప్రేమ గాధ విజయం తరువాత దర్శకుడు హను రాఘవపూడి దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో మంచి హైప్ తెచ్చుకుంది.

నితిన్ స్టైలీష్ క‌నిపించ‌డంతో పాటు సీనియ‌ర్ హీరో అర్జున్ విల‌న్‌గా న‌టించ‌డంతో పాటు సినిమా రూ.40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేయ‌డంతో సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోను ఉంది. ఈ రోజు రిలీజ్ అవుతోన్న లై ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో పలు చోట్ల ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది.

అక్క‌డ ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం సినిమా మొత్తం రిచ్‌లుక్‌లోనే ఉంది. 14 రీల్స్ వారు డ‌బ్బుకు వెనుకాడ‌కుండా సినిమాను నిర్మించారు. నితిన్‌, హీరోయిన్ మేఘా ఆకాష్ కెమిస్ట్రీ, రొమాన్స్ సూప‌ర్బ్‌. ఫ‌స్టాఫ్‌ను సోసోగా న‌డిపించి ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌తో ఉత్కంఠ పెంచేశాడు.

సెకండాఫ్‌లో ఎంతో ఉంటుంద‌ని ఆశించిన ప్రేక్ష‌కుడికి కాస్త నిరాశ ఎదుర‌వుతుంది. స్లోగా ఉండ‌డంతో పాటు అంత‌గా ఎట్రాక్టివ్‌గా లేని ట్విస్టులు, అన‌వ‌స‌ర స‌న్నివేశాలు ఎక్కువ‌య్యాయి. అర్జున్ రోల్ ఈ సినిమాకు మేజ‌ర్ హైలెట్‌. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి త‌న స్టైలిష్ మేకింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.

క‌థ‌లో అంచ‌నాల‌కు అనుగుణంగా ద‌మ్ము లేక‌పోవ‌డం మైన‌స్‌. ఓవ‌రాల్‌గా ఇది ఏ సెంట‌ర్ సినిమా. బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుందో ? లేదో ? చూడాలి. ఇక ఈ సినిమా బ‌డ్జెట్ ఎక్కువ‌వ్వ‌డంతో క‌మ‌ర్షియ‌ల్‌గా ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుంది ? అన్న‌ది ఈ రోజు రిలీజ్ అవుతోన్న మిగిలిన రెండు సినిమాల ఫ‌లితాల‌ను బ‌ట్టి ఉంటుంది.

ఇక ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం లై బిలో ఏ సెంట‌ర్ల‌లోని ప్రేక్ష‌కుల‌కు, మల్టీఫ్లెక్స్‌కు క‌నెక్ట్ అయ్యే సినిమాగాను, ఓవ‌రాల్‌గా బిలో యావ‌రేజ్ సినిమాగాను నిలుస్తుంద‌ని తెలుస్తోంది. ఇక లై పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగు జ‌ర్న‌లిస్ట్‌.కాం