‘జయ జానకి నాయక’ గందరగోళానికి బోయపాటి బ్రేక్

సినిమా విడుద‌ల ఒక ప్ర‌హ‌స‌నంలా మారిపోయింది. అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల కాక‌పోతే.. బ‌య్య‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కి ఎంత న‌ష్ట‌మో మాట‌ల్లో చెప్ప‌డం అంతా ఇంతా కాదు! ఇక డైరెక్ట‌ర్ క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం!! ప్ర‌స్తుతం స్టార్ డెరెక్ట‌ర్ బోయ‌పాటికి కూడా సినిమా క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ట‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `జ‌య జాన‌కి నాయ‌క‌` సినిమా ఈ నెల 11న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అదే రోజు మ‌రో రెండు సినిమాలు కూడా విడుద‌ల కాబోతోన్నాయి. అయితే దీని వెనుక పెద్ద త‌తంగ‌మే నడించింద‌ట‌. సినిమాను అదే రోజు విడుద‌ల చేసేందుకు.. ఆయ‌న చాలా ప‌ట్టుప‌ట్టార‌ని తెలుస్తోంది.

ప్రసాద్ ల్యాబ్ వేదికగా మూడు వంతుల మీటింగ్ లు, బోయపాటి ఆఫీస్ లో మరి కొన్ని. ఎన్ని మీటింగ్ లు అయినా, ఎంత వత్తిడి వచ్చినా ఆయన మాట ఒకటే 11వ తేదీ అని ముందుగా అనుకున్నాం. అదే తేదీకి విడుదల చేద్దాం. వాస్తవానికి ఈ సినిమా గత నెలలో రావాల్సి ఉంది. కానీ దిల్ రాజు `ఫిదా` సినిమాను ప్లాన్ చేసుకున్నారు. జయ జానకి నాయక సినిమాకు కూడా ఆయ‌నే డిస్ట్రిబ్యూటర్. అందువల్ల నిర్మాతలు కావాలని తమ సినిమాను వెనక్కు తెచ్చుకున్నారు. అలా తెచ్చుకుంటే, మైనస్ అవుతుందని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్లో చేయమని వాళ్లే దర్శకుడు బోయపాటిని కోరారు. దాంతో ఆయన తల వంచారు.

ఒకసారి అలా తల వంచానని, మళ్లీ మళ్లీ అంటే తన వల్ల కాదని బోయపాటి ఈ సారి కరాఖండీగా చెప్పేశారు. వాస్తవానికి ముందు రెండు రోజులు సినిమాను ఓ రోజు ముందుగా విడుదల చేయడంపై మీటింగ్ లు నడిచాయి. దానికి బోయపాటి ఓకె అనలేదు. 10న రావాలి అనుకుంటే, 1వ తేదీ నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేయాలన్నది ఆయన ఆలోచన. అలా జరగలేదు కాబట్టి వద్దని చెప్పేశారు. ఉన్నట్లుండి బయ్యర్ల వైపు నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. అనుకున్న రేంజ్ లో డబ్బులు కట్టలేమని, మూడు సినిమాలు వస్తాయని తాము అనుకోలేదని వాళ్లు అడ్డం ప‌డ్డార‌ట‌. దీంతో మంగళవారం ఉదయం నుంచి కొత్త మంతనాలు ప్రారంభమయ్యాయి.

ఇక వీట‌న్నింటికీ ముగింపు పలకాలని బోయ‌పాటి డిసైడ్ అయ్యారు. 11న విడుదల విడుద‌ల‌ చేస్తూ మేసేజ్ పంపేయమని తన యూనిట్ ను ఆదేశించేశారు. మరో పక్క డబ్బులు కట్టలేమన్న బయ్యర్లకు నిర్మాత రవీందర్ రెడ్డి ఝలక్ ఇచ్చారని వినికిడి. అవసరం అయితే తానే నేరుగా విడుదల చేసుకుంటానని అన్నారు. దీంతో మొత్తానికి వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఇంకో పక్క జయజానకీనాయక వాయిదా పడుతుందని మిగిలిన రెండు సినిమాల నిర్మాతలు ఉత్కంఠతో ఎదురు చూశారు. ఒక్క సినిమా వాయిదా పడితే చాలు, బిజినెస్ సమస్యలు ఒడ్డెక్కేస్తాయ నుకున్నారు. కానీ వారికి చివ‌రికి నిరాశే ఎదురైంది.