‘ గౌత‌మ్‌నంద‌ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… హిట్టా ఫ‌ట్టా

మాస్ హీరో గోపీచంద్ కెరీర్ కొద్ది రోజులుగా అనుకున్న రేంజ్‌లో ముందుకు సాగ‌డం లేదు. సౌఖ్యం లాంటి డిజాస్ట‌ర్ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న గోపీచంద్ గౌత‌మ్‌నంద‌ సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత భారీ గ్యాప్ తీసుకున్న మాస్ డైరెక్టర్ సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప‌క్కా మాస్ సినిమా గోపీచంద్ కెరిర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. టీజ‌ర్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఇప్ప‌టికే అమెరికాలో ప్రీమియ‌ర్ షో కంప్లీట్ చేసుకుంది.

ప్రీమియ‌ర్ షో త‌ర్వాత ఈ సినిమాకు వ‌చ్చిన టాక్ గురించి చెప్పుకుంటే మాస్ సినిమాల‌తో మెప్పించే గోపీచంద్ ఫ‌స్ట్ టైం ఓ మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. గోపీచంద్ డ్యూయ‌ల్ రోల్ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. గౌత‌మ్‌, నంద‌ క్యారెక్ట‌ర్ల‌లో గోపీచంద్ న‌ట‌న‌, క‌థ‌లో సంప‌త్‌నంది రాసుకున్న ట్విస్టులు ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్‌కు గురి చేయ‌డం ఖాయ‌మంటున్నారు.

ఇక యాక్ష‌న్ సీన్ల‌లో గోపీచంద్ కొట్టిన‌పిండి. ఈ సినిమాలో గోపీ యాక్టింగ్ యాక్ష‌న్ సీన్ల‌లో ఓ రేంజ్‌లో ఎలివేట్ అయ్యింది. ఇక థ‌మ‌న్ ఆర్ ఆర్‌, సాంగ్స్ పిక్చ‌రైజేష‌న్ బాగున్నాయి. ఇక హీరోయిన్ల‌లో హ‌న్సిక అల్ల‌రి పిల్ల‌గా న‌టిస్తే, కేథ‌రిన్ థెస్రా క‌థ‌ను మ‌లుపు తిప్పే రోల్ చేసింది. ఇక కొన్ని సీన్లు రెగ్యుల‌ర్ సినిమాల్లో సీన్ల‌ను త‌ల‌పించ‌డం, సెకండాఫ్‌లో క‌థ స్లో అవ్వ‌డం కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు అస‌హ‌నం క‌లిగించ‌వ‌చ్చు.

భావోద్వేగ స‌న్నివేశాల్లో ఇంకాస్త బెట‌ర్‌గా సీన్లు రాసుకుని ఉండాల్సింది. రామ్‌-ల‌క్ష్మ‌ణ్ ఫైట్లు మాస్ ప్రేక్ష‌కుల‌కు మంచి విందు భోజ‌నం. బ్యాకాంగ్‌, దుబాయ్ స‌న్నివేశాల్లో సినిమా నిర్మాణ విలువ‌ల రిచ్‌నెస్ క‌న‌ప‌డుతుంది.

ప్ల‌స్‌లు (+):

– కాథరిన్ థెస్రా న‌ట‌న‌

– విజువ‌ల్స్‌

– సాంగ్స్ పిక్చ‌రైజేష‌న్‌

– స్టోరీ

– ఫ‌స్టాఫ్‌

మైన‌స్‌లు (-):

– సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు

– స్లో స్క్రీన్ ప్లే

– పేల‌ని కామెడీ

– బోర్ కొట్టించే సెకండ్ హాఫ్

ఫైన‌ల్‌గా….

యాక్ష‌న్ ప్రియుల‌కు విందు భోజ‌నం ఈ గౌత‌మ్‌నంద‌…పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి..