ఇటీవల మృతిచెందిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు అటు ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో చాలా విషయాలను కమాండింగ్ చేసే సత్తా ఉంది. టాలీవుడ్లో ఎంత పెద్దవాళ్లు అయినా దాసరికి భయపడేవారు. ఆయన నోరు విప్పితే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు. ఇక రాజకీయాల్లో సైతం దాసరి తనవంతు పాత్రను సమర్థవంతంగానే పోషించారు. ఇప్పుడు దాసరి లేరు.
మరి టాలీవుడ్లో దాసరి 2 ఎవరంటే ఒకే ఒక్కపేరు వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు దాసరి ప్రియశిష్యుడు, దత్తపుత్రుడు లాంటి వాడు అయిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. మోహన్‌బాబు – దాసరి మధ్య ఉన్న సంబంధం తండ్రికొడుకుల కంటే గొప్పగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. అంతలా వీరిద్దరూ ఉండేవారు.
దాసరి ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ఉందంటే మోహన్‌బాబు దాసరి ఇంటికే మకాం మార్చేసేవారు. ఇక దాసరి అనారోగ్యంతో ఉన్నప్పుడు మోహన్‌బాబు చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉండి దాసరికి సపర్చలు చేశారు. దాసరి అంత్యక్రియల టైంలోను మోహన్‌బాబే కీలకపాత్ర పోషించారు.
ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో దాసరి పోషించిన పెద్దన్న పాత్రను మోహన్‌బాబే పోషించాల్సి ఉంటుందన్న చర్చలు వినిపిస్తున్నాయి. మోహన్‌బాబుకు కూడా అందరిని కమాండిగ్ చేసే శక్తి ఉంది. రాజకీయంగా కూడా మోహన్‌బాబు అటు చంద్రబాబు, ఇటు జగన్‌కు బంధువు. కేసీఆర్‌తోను ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఆయనంటే ఓ భయం ఉంటుంది.
ఈ క్రమంలోనే అటు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పోషించిన బాధ్యతను ఇప్పుడు మోహన్‌బాబే తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక దాసరి ఫ్యామిలీలో చెలరేగిన ఆస్తి వివాదం రచ్చ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మోహన్‌బాబు మీదే ఉంది.