మ‌హేష్ – మురుగ‌దాస్ భారీ బ‌డ్జెట్‌తో 28న ఫ‌స్ట్ లుక్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్న‌ట్టు మురుగ‌దాస్ చెప్పేశారు. దీంతో ఇప్పుడు సినిమా జ‌నాలు బాహుబ‌లి త‌ర్వాత ఈ సినిమా కోస‌మే ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్ కావ‌డంతో ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్ వ‌ర్గాల్లోను ఈ సినిమాపై ఎంతో హైప్ ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాకు ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అభిమ‌న్యుడు – సంభ‌వామి యుగే యుగే – సంభ‌వామి – ఎనిమీ – మ‌ర్మం – ఏజెంట్ శివ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ట్రెండ్ అయ్యాయి. అయితే వీటిలో ఏ ఒక్క‌టి ఫైన‌లైజ్ కాలేదు.

లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమాకు టైటిల్ ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ” స్పైడ‌ర్ ” అనే టైటిల్‌ను మురుగ‌దాస్ ఫిక్స్ చేశాడ‌ట‌. ఈ నెల 28న ఫ‌స్ట్ లుక్ రానుంది. మే నెల‌లో ఆడియో రిలీజ్ చేసి, జూన్ 23న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మ‌హేష్‌బాబు సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రూ.90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది.