శాత‌క‌ర్ణి ముందు బాహుబ‌లి బ‌లాదూర్ అంటోన్న హీరోయిన్‌

ఆమె అలనాటి అందాల రాణి. దివంగ‌త లెజెండ్రీ న‌టులు సీనియ‌ర్ ఎన్టీఆర్‌, ఏఎన్నార్ నుంచి నాటి త‌రం అగ్రహీరోల అందరి పక్కన తన అభినయాన్ని ప్రదర్శించిన మేటి నటి. ఆమె సినిమా రంగానికి గుడ్ బై చెప్పాక రాజ‌కీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి న‌టి రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లికి-బాల‌య్య చారిత్ర‌క మూవీ శాత‌క‌ర్ణి మీద చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారాయి.

అల‌నాటి అందాల హీరోయిన్ జ‌మున‌కు తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి సినిమా క‌న్నా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమానే బాగా న‌చ్చింద‌ట‌. బాహుబ‌లి రిలీజ్ అయిన‌ప్పుడు ఆ సినిమా అంతా గ్రాఫిక్స్ మాయాజాల‌మే అని, ఆ సినిమాలో క‌థాబ‌లం ఏముంద‌ని ప్ర‌శ్నించిన ఆమెపై అప్ప‌ట్లో నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు కూడా చేశారు.

తాజాగా ఆమె బాల‌య్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను పొగడ్తలతో ముంచెత్తింది. శాత‌క‌ర్ణి స్పెష‌ల్ షో చూసిన జ‌మున శాత‌క‌ర్ణి సినిమా ఒక ‘తురుపు ముక్క’ అంటూ ప్రశంసించింది. శాతకర్ణి రోల్‌లో బాల‌య్య చ‌క్క‌గా ఒదిగిపోయాడ‌ని, డైరెక్ట‌ర్ క్రిష్ ఈ పాత్ర‌ను చాలా అద్భుతంగా మలిచాడ‌ని ఆమె ఆకాశానికి ఎత్తేశారు.

కేవ‌లం 79 రోజుల్లోనే ఇంత మంచి చిత్రాన్ని క్రిష్ ప్ర‌జెంట్ చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని ఆమె ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. బాల‌కృష్ణ న‌ట‌న చాలా గొప్ప‌గా ఉంద‌న్న ఆమె సినిమా చూసిన అనంతరం బాల‌య్య నుదుటిపై ప్రేమ‌తో ముద్దు పెట్టారు. ఇక సినిమాలో వాణిజ్య అంశాలు జోడించినా క‌థ‌ను మాత్రం దారి త‌ప్పకుండా చూపించార‌ని ఆమె శాత‌క‌ర్ణి టీంను అభినందించింది.