అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ జనరేషన్ హీరో. మెగా మేనల్లుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కేరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. నాలుగు వరుస రూ.50 కోట్ల సినిమాల్లో నటించి టాలీవుడ్ హిస్టరీలోనే ఏ హీరోకు లేని అరుదైన రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు.
2014లో వచ్చిన రేసుగుర్రం సినిమాతో రూ.50 కోట్ల క్లబ్‌లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన బన్నీ గతేడాది సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవితో పాటు ఈ యేడాది సమ్మర్లో వచ్చిన సరైనోడు సినిమాతో కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బన్నీప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే బన్నీకి గత మూడు సంవత్సరాలుగా ఏప్రిల్ నెల బాగా కలిసొస్తోంది. ఈ నెల బన్నీకి సెంటిమెంట్ నెలగా మారిపోయింది. ఏప్రిల్‌లో మూడు సంవత్సరాలుగా వచ్చిన రేసుగుర్రం- సన్నాఫ్ సత్యమూర్తి – సరైనోడు సినిమాలు హిట్ అయ్యాయి. ఇలాంటి ఛాన్స్‌ను బన్నీ వచ్చే సమ్మర్లో మిస్ అయ్యే పరిస్థితి వస్తోంది. దీంతో బన్నీ దువ్వాడ జగన్నాథమ్‌కు సమ్మర్లో సరైన రిలీజ్ డేట్ దొరికేలా లేదు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్, కాటమరాయుడు సినిమాను మార్చి ఆఖరి వారంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఏప్రిల్ 14న మహేష్ – మురుగదాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తోంది. మరో రెండు వారాలకు ఏప్రిల్ 28న బాహుబలి 2 రానుంది. సో ఈ లెక్కన చూస్తే జూన్ వరకు బన్నీ సినిమాకు సరైన రిలీజ్ డేట్ దొరికేలా లేదు. మరి తనకు బాగా అచ్చివచ్చిన సీజన్‌ను బన్నీ మిస్ అయితే దువ్వాడ జగన్నాథమ్‌ను ఎప్పుడు థియేటర్లలోకి తెస్తాడో చూడాలి.