ఆ స్టార్ హీరోతో మెగా ఫ్యామిలీకి వార్‌

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి…స్టామినా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాలీవుడ్‌లో మార్కెట్ ప‌రంగా మెగా ఫ్యామిలీ హీరోల డామినేష‌న్ ఎక్కువగానే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు ఆరేడుగురు హీరోలు ఉండ‌డంతో వారి సినిమాలే ప్ర‌తి యేడాది ఎక్కువ‌గా రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ ఓ స్టార్ హీరోను టార్గెట్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో కాదు …సౌత్ ఇండియాలోనే టాప్ హీరోల‌లో ఒక‌డైన సూర్య‌. మెగా ఫ్యామిలీకి సూర్య‌తో గొడ‌వేంట‌ని అనుకుంటున్నారా…అయితే మ‌నం మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ చెర్రీ హీరోగా ధృవ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు వాయిదాలు ప‌డిన ఈ సినిమా డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేయాల‌ని అల్లు అర‌వింద్ ప్లాన్లు వేస్తున్నారు.

ఈ సినిమాతో అటు అర‌వింద్‌, ఇటు చెర్రీ భారీ ఓపెనింగ్స్ మీద క‌న్నేశారు. ప్ర‌స్తుతం ఫైనాన్షియల్ డెఫిసిట్ నడుస్తున్న దృష్ట్యా .. సినిమాలను ఎంత భారీ రేంజులో రిలీజ్ చేసినా కూడా భారీ ఓపెనింగులు వచ్చే ఛాన్సే లేదు. అందుకే సినిమాల మధ్య లాంగ్ గ్యాప్ ఉంటేనే కాని క‌లెక్ష‌న్లు రావు. దీంతో డిసెంబ‌ర్ 9న ధృవ వ‌స్తే మ‌రుస‌టి వారం 16న సూర్య ఎస్‌-3 (య‌ముడు 3 ) సినిమాతో భారీగా వ‌స్తున్నాడు.

ఎస్‌-3పై సౌత్ ఇండియాలోనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ధృవ వ‌చ్చిన మ‌రుస‌టి వార‌మే ఆ సినిమా వ‌స్తే ధృవ‌పై ఖ‌చ్చితంగా ఎఫెక్ట్ ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే సూర్య‌తో ఎస్‌-3ను వాయిదా వేయించేలా అర‌వింద్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడ‌ట‌. అయితే ఎస్‌-3 సౌత్ ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్టు కావ‌డంతో ఆ సినిమాను వాయిదా వేసేందుకు సూర్య ఒప్పుకోడ‌న్న టాక్ కూడా వ‌స్తోంది. అదే జ‌రిగితే ఏపీ, తెలంగాణ‌లో ఎస్‌-3కు సాధ్య‌మైనంత‌గా థియేట‌ర్లు దొర‌క్కుండా చేసే ప్ర‌య‌త్నాలు కూడా అర‌వింద్ చేస్తున్నాడ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.