వరుస సక్సెస్‌లతో ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంటన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నా ఎన్టీఆర్ ఏ డైరెక్టర్‌తో కమిట్ అవుతాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. ఇక ఎన్టీఆర్ ఇప్పటికే వినాయక్, రాజమౌళి, బోయపాటి శ్రీను, కొరటాల శివ, పూరి జగన్నాథ్, సుకుమార్ ఇలా చాలా మంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి హిట్లు కొట్టాడు.
చాలా రోజులుగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ జనాలు ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఆ సినిమా ఎన్టీఆర్ కేరీర్‌లోనే ఓ డిఫరెంట్ మూవీగా మిగిలిపోతుందన్న చర్చలు కూడా జరిగాయి.
ఇక కొద్ది రోజుల క్రితమే త్రివిక్రమ్ సైతం ఎన్టీఆర్‌కు ఓ స్టోరీ చెప్పాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌ను సెట్ చేసేందుకు ఓ టాలీవుడ్ అగ్ర నిర్మాత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఆ నిర్మాత ఎవరో కాదు, ఎన్టీఆర్ కు నాన్నకు ప్రేమతో లాంటి మంచి హిట్ ఇచ్చిన భోగవిల్లి ప్రసాద్. ఆయనకు ఇటు ఎన్టీఆర్, అటు త్రివిక్రమ్ తో మంచి సంబంధాలు వున్నాయి.
అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ సినిమా కోసం పనిచేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి నుంచి సెట్స్‌మీదకు వెళుతుంది. మరి ఈ లోగా భోగవల్లి ప్రసాద్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్నె ఎంత వరకు సెట్ చేస్తాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా విషయంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది.