NTR గ్యారేజ్ లోకి మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ఇప్పటివరకు చెన్నైలో జరిగిందట. బాలీవుడ్ మూవీ అఖీరా ప్రమోషన్ కోసం ఈ మూవీకి బ్రేక్ ఇచ్చాడు మురుగదాస్. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లోని సారథీ స్టూడియోలో జరగనున్నదట.

అయితే  ‘జనతా గ్యారేజ్‌’ కోసం సెట్ వేసింది కూడా సారథీ స్టూడియోలోనే ఇప్పుడు మహేష్ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలుకూడా ఆ సెట్ లోనే చిత్రీకరించనున్నారట. అందుకు తగ్గట్టుగా సెట్‌లో చిన్న చిన్న మార్పులు చేయించాడట మురుగదాస్. ఈ విధంగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లోకి మహేష్ ఎంటర్ అవుతున్నాడు.